జర్నలిస్ట్‌ మనోజ్‌ సోదరుడు ఫిర్యాదు | Journalist Manoj Brother Complaint Against Gandhi Hospital Doctors | Sakshi
Sakshi News home page

గాంధీ వైద్యుల నిర్లక్ష్యంతోనే జర్నలిస్ట్‌ మనోజ్‌ మృతి

Jun 13 2020 12:11 PM | Updated on Jun 13 2020 12:11 PM

Journalist Manoj Brother Complaint Against Gandhi Hospital Doctors - Sakshi

చిలకలగూడ సీఐకు ఫిర్యాదు చేస్తున్న సాయికుమార్‌

చిలకలగూడ : కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జర్నలిస్ట్‌ మనోజ్‌కుమార్‌ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని సోదరుడు సాయికుమార్‌ చిలకలగూడ ఠాణాలో శుక్రవారం ఫిర్యాదు  చేశాడు. కరోనాతో బాధపడుతు తనతోపాటు సోదరుడు మనోజ్‌కుమార్‌ ఈనెల 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత గాంధీఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యామన్నారు. గాంధీ అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తన సోదరుడు మనోజ్‌కుమార్‌ ఈనెల 7వ తేదిన మృతి చెందాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన సోదరుడు మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన  గాంధీ సూపరింటెండెంట్, నోడల్‌ అధికారి, సంబంధిత వైద్యులు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement