ఇప్పటివరకు కేంద్రంలో ఏం చక్రం తిప్పారు 

Jeevan Reddy slams TRS for non fulfilment of election promises - Sakshi

మాజీమంత్రి జీవన్‌రెడ్డి 

జగిత్యాలరూరల్‌: రాష్ట్రం లో టీఆర్‌ఎస్‌కు ఇప్పటివరకు ఉన్న ఎంపీలతో కేం ద్రంలో ఏం చక్రం తిప్పా రని, రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేశారో చెప్పాలని కాంగ్రెస్‌ నేత, మాజీమంత్రి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుంచి బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీని తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకువచ్చేందుకు ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌ మంజూరు చేశామన్నారు.  ఆ ప్రాజెక్ట్‌ను టీఆర్‌ఎస్‌ పక్కన పడేసిందన్నారు. ప్రాణహిత నదీ జలాలు తరలించేలా ఏర్పాట్లు చేసిన మేడిగడ్డ, తమ్మడిహెట్టికి జాతీయ ప్రాజెక్టు హోదా సాధించే అవకాశం ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హోదా రాలేదన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top