
హౌసింగ్‌బోర్డుకాలనీలో పూజారులతో ఎమ్మెల్సీ నారదాసు
కొత్తపల్లి/కరీంనగర్‌రూరల్ : శ్రీసమ్మక్క–సారలమ్మ జాతరలో భాగంగా బుధవారం సారలమ్మ గద్దెనెక్కడంతో తొలిఘట్టం పూర్తయింది. సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య వనజాతర మొదలైంది. శివసత్తుల పూనకాలు, భక్తుల సందడి మధ్య జాతర ప్రదేశం జనజాతరగా మారింది. రెండేళ్లకోసారి వైభవంగా జరిగే శ్రీసమ్మక్క–సారలమ్మ జాతరకు కరీంనగర్ మండలం ఇరుకుల్ల, నగునూరు, హౌసింగ్‌బోర్డుకాలనీ, కొత్తపల్లి మండలం రేకుర్తి, చింతకుంట గ్రామాల్లో నిర్వాహకు లు ఏర్పాట్లు చేశారు. మినీ మేడారంగా పేరొందిన రే కుర్తిలో ఉదయం నుంచే భక్తులు వేలాదిగా తరలివ చ్చారు. సాయంత్రం మేడారం నుంచి వచ్చిన కోయ పూజారి పీరీల సాంబయ్య, స్థానికుడు సుదగోని శ్రీని వాస్‌గౌడ్ రేకుర్తిలోని ఎరుకలిగుట్ట నుంచి సారల మ్మను ఊరేగింపుగా తెచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. శ్రీ సమ్మక్క–సారలమ్మ వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, దేవాదాయశాఖ ఈవో కె.ప్రభాకర్, సర్పంచ్ నందెల్లి పద్మప్రకాష్, ఉపసర్పంచ్ సుదగోని కృష్ణకు మార్‌గౌడ్, ఎంపిటిసీలు జక్కుల నాగరాణి మల్లేశం, ఏ దుళ్ల రాజశేఖర్, మొక్కలు చెల్లించారు.
చంద్ర గ్రహణ ప్రభావం..
చంద్రగ్రహణం ప్రభావంతో కరీంనగర్ మండలంలో సమ్మక–సారలమ్మ జాతర ఆలస్యంగా ప్రారంభమైంది. నగునూర్, ఇరుకుల్లలో రాత్రి వేళ సారలమ్మను గద్దెలపైకి తెచ్చారు. హౌసింగ్‌బోర్డుకాలనీలో చంద్రగ్రహణం ఎఫెక్ట్‌తో సాయంత్రం 4గంటలకే అ మ్మవారిని గద్దెపైకి తెచ్చారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఎదురెళ్లి స్వాగతం పలికారు. జాతర నిర్వహణ కమిటీ చైర్మన్ ఉయ్యాల ముత్యం గౌ డ్, సభ్యులు తోట మోహన్, కొండూరి అనిల్, బీజే పీ నాయకులు ఉప్పు రవీందర్, సుజాతరెడ్డి, లింగమూర్తి పాల్గొన్నారు. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో విద్యు త్, తాగునీటి సౌకర్యం కల్పించారు. నగునూరు సర్పం చ్ కన్నెమల్ల సుమలత–కోటి, ఉపసర్పంచ్ వినయ్‌సాగర్, ఎంపీటీసీ సభ్యులు భద్రయ్య, చంద్రమ్మ, కమిటీ చైర్మన్ కస్తూరి అశోక్‌రెడ్డి, ఇరుకుల్లలో జాతర వ్యవస్థాపక చైర్మన్ బుర్ర చంద్రయ్యగౌడ్, వైస్‌చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
నేడు సమ్మక్క రాక
గురువారం సమ్మక్క ఆగమనంతో జాతర పులకించనుంది. తొలిరోజు సుమారు 40–50 వేల మంది భక్తులు గద్దెలను దర్శించుకున్నట్లు నిర్వాహకులు అంచనా వేశారు. గురు, శుక్రవారాలు సుమారు 5 లక్షల వరకు భక్తులు దర్శించుకునే అంచనాలతో భారీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.
జాతరకు సెలవులు ప్రకటించాలి
శాతవాహనయూనివర్సిటీ : సమ్మక–సారలమ్మ జాతరకు సెలవులు ప్రకటించాలని శాతవాహన యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పెంచాల శ్రీనివాస్ ప్రకటనలో కోరారు. దేశంలోనే గుర్తింపుపొందిన గిరిజన జాతరకు సెలవులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
ట్రాఫిక్ మళ్లించాలి
కొత్తపల్లి : మండలంలోని రేకుర్తిలో సమ్మక్క–సారల మ్మ జాతరకు అధికసంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో జగిత్యాల వైపు నుంచి వచ్చే వాహనాలను కొత్తపల్లి బైపాస్ నుంచి చింతకుంట, పద్మనగర్ మీ దుగా కరీంనగర్ మళ్లించాలని కోరుతూ ఏసీపీ టి.ఉషారాణికి బుధవారం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం మారుతి వినతిపత్రం ఇచ్చారు. శ్రావణ్‌కుమార్, సతీష్‌కుమార్, అంజయ్య, రాంచందర్, రాములు, సాయికుమార్, అవినాశ్ పాల్గొన్నారు.