కరీంనగర్ జిల్లా జిగిత్యాల తహశీల్దార్ కార్యాలయం, కార్యాలయంలోని ఫర్నిచర్‌ను శుక్రవారం కోర్టు ఆదేశాల మేరకు జప్తు చేశారు.
జగిత్యాల: కరీంనగర్ జిల్లా జిగిత్యాల తహశీల్దార్ కార్యాలయం, కార్యాలయంలోని ఫర్నిచర్‌ను శుక్రవారం కోర్టు ఆదేశాల మేరకు జప్తు చేశారు. లింగంపేట చెరువు ముంపు బాధితుల పరిహారాన్ని రూ.3కోట్ల మేరకు చెల్లించాలని జిల్లా సెషన్స్ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. వీటిని అమలు చేయకపోవడంతో శుక్రవారం రెవెన్యూ ఆస్తులను జప్తు చేశారు.