ఏడు పదుల వయసులో ఎంఫిల్! | In the age of 70 completed M Phil | Sakshi
Sakshi News home page

ఏడు పదుల వయసులో ఎంఫిల్!

Mar 30 2015 12:35 AM | Updated on Sep 2 2017 11:33 PM

ఏడు పదుల వయసులో ఎంఫిల్!

ఏడు పదుల వయసులో ఎంఫిల్!

చదువుకు వయసుతో పని లేదని నిరూపించారు నిజామాబాద్‌కు చెందిన న్యాయవాది ముస్కు రాజేశ్వర్‌రెడ్డి.

నిజామాబాద్: చదువుకు వయసుతో పని లేదని నిరూపించారు నిజామాబాద్‌కు చెందిన న్యాయవాది ముస్కు రాజేశ్వర్‌రెడ్డి. ఏడు పదుల వయసులో దూరవిద్య ద్వారా ఎంఫిల్ పట్టా పొందారు. ఎస్‌వీ వర్సిటీలో ఆయన ఆర్‌కే నారాయణన్ నవలలపై పరిశోధనా పత్రాలను సమర్పించారు.

ఇది దూరవిద్యలో ఆయనకు ఆరవ పీజీ. ఓయూ నుంచి ఎంఏ చరిత్ర, మధురై కామరాజు వర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లిష్, హిమాచల్‌ప్రదేశ్ వర్సిటీ ద్వారా ఎంఈడీ, కాకతీయ, నాగార్జున వర్సిటీల నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. దూరవిద్య ద్వారానే జర్నలిజంలో పీజీ డిప్లొమా కూడా పొందారు. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి, జూనియర్ లెక్చరర్‌గా పదవీ విరమణ పొందిన రాజేశ్వర్‌రెడ్డి, అనంతరం న్యాయవాద వృత్తిని స్వీకరించారు. రెండవ శ్రేణి మేజిస్ట్రేట్‌గానూ పనిచేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement