
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన మెర్సర్ సంస్థ సర్వేలో వరుసగా నాలుగో ఏడాది ఉత్తమ నగరంగా హైదరాబాద్ ఎంపికైందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసిన మెర్సస్ సంస్థ నగరంలోని శాంతి భద్రతల్ని పరిగణనలోకి తీసుకుని దేశంలోనే బెస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ సిటీగా హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ ఘనత సాధించడంలో సిటీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలదే కీలక పాత్రని కొత్వాల్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ గుర్తింపును దృష్టిలో పెట్టుకుని నగర పోలీసు విభాగం మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తుందని వెల్లడించారు.