‘శ్రీనిధి’ వ్యయాలను మళ్లీ పరిశీలించండి | high court asks expenditure of srinidhi college | Sakshi
Sakshi News home page

‘శ్రీనిధి’ వ్యయాలను మళ్లీ పరిశీలించండి

Nov 25 2016 3:17 AM | Updated on Aug 31 2018 8:31 PM

శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2016-17 నుంచి 2018-19 విద్యా సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిషన్ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన రూ. 91 వేల ఫీజును హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది.

టీఏఎఫ్‌ఆర్‌సీకి హైకోర్టు ఆదేశం  
సాక్షి, హైదరాబాద్: శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2016-17 నుంచి 2018-19 విద్యా సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిషన్ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన రూ. 91 వేల ఫీజును హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. శ్రీనిధి కాలేజీ సమర్పించిన వ్యయాల రికార్డులను మరోసారి పరిశీలన చేసి ఫీజును నిర్ణయించాలని టీఎఎఫ్‌ఆర్‌సీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. తమ వ్యయాల ఆధారంగా ఇంజనీరింగ్ కోర్సుకు రూ.1.54 లక్షలను ఫీజు నిర్ణరుుంచాలని కోరితే, టీఏఎఫ్‌ఆర్‌సీ మాత్రం రూ. 91 వేలనే ఫీజును నిర్ణయించిందంటూ హైకోర్టును శ్రీనిధి కాలేజీ యాజమాన్యం ఆశ్రయించింది.

తమ వ్యయాల రికార్డులను పూర్తిస్థారుులో పరిశీలన చేయకుండానే టీఏఎఫ్‌ఆర్‌సీ ఫీజును ఖరారు చేసిందని ఆ కాలేజీ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు ఆ కాలేజీ వ్యయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఫీజు ఖరారుపై తగిన నిర్ణయం తీసుకోవాలని టీఏఎఫ్‌ఆర్‌సీని ఆదేశించింది. టీఏఎఫ్‌ఆర్‌సీ ఫీజును ఖరారు చేసిన నాటి నుంచి రెండు వారాల్లో దానిని నోటిఫై చేయాలని ప్రభుత్వానికి న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement