మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది.
మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గ్యాస్ కట్టర్లతో లాకర్లను కట్ చేసి నగలు, నగదును దుండగులు దోచుకెళ్లారు. 4 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలతో పాటు 16-18 లక్షల రూపాయల నగదు కూడా ఈ దోపిడీలో అపహరణకు గురైంది. బ్యాంకు వెనకభాగం నుంచి దొంగలు ప్రవేశించారు. నిత్యం రద్దీగా ఉండే జాతీయరహదారి పక్కనే ఉంటుంది. జనవాసాల మధ్య, పోలీసు స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. రైతులు రుణాల కోసం కుదువపెట్టిన బంగారమే పెద్ద ఎత్తున పోయినట్లు తెలుస్తోంది. బ్యాంకు సిబ్బంది ప్రమేయం, సెక్యూరిటీ గార్డు ప్రమేయం ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంకు విషయాలు బాగా తెలిసినవాళ్లే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో బ్యాంకులలో చోరీలు, దోపిడీలకు ప్రయత్నాలు జరిగినా.. ఇంత పెద్ద ఎత్తున పోవడం మాత్రం ఇదే మొదటిసారి.