అనాథ చిన్నారుల మధ్య హరీశ్‌ జన్మదిన వేడుకలు | Harish rao Birthday Celebrations | Sakshi
Sakshi News home page

అనాథ చిన్నారుల మధ్య హరీశ్‌ జన్మదిన వేడుకలు

Jun 4 2018 11:01 AM | Updated on Jun 4 2018 11:01 AM

గజ్వేల్‌ : అనాథ చిన్నారుల మధ్య నీటి పారుదల శాఖామంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దుబ్బాక పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని ఆశాజ్యోతి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు చిన్నారుల మధ్య కేక్‌ను కట్‌ చేసి తినిపించారు.

చిన్నారుల సంక్షేమం కోసం రూ. 25వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, మున్సిపల్‌ చైర్మన్‌ భాస్కర్, కేసీఆర్‌ యువసేన అధ్యక్షుడు అనూప్, ఆశాజ్యోతి డైరెక్టర్‌ ఫాదర్‌ ఆల్వీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement