మత్స్యకారులకు చేయూత | Harish Rao about fisher mans | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు చేయూత

Sep 18 2017 2:26 AM | Updated on Sep 19 2017 4:41 PM

మత్స్యకారులకు చేయూత

మత్స్యకారులకు చేయూత

రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్‌:
రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని కోమటి చెరువులో 1.20 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కేవలం నీటి పారుదల శాఖ చెరువుల్లో మాత్రమే చేప పిల్లలను వదిలే వారన్నారు. ఈ ఏడాది ఐబీ చెరువులతో పాటు కుంటలు, చెక్‌డ్యామ్‌లు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేపపిల్లలను అందిస్తున్నామని చెప్పారు. 50 శాతం నీరు చేరిన చెరువుల్లో చేప పిల్లలను వదులుతున్నట్లు చెప్పారు. బతుకమ్మ చీరల కోసం రూ.222 కోట్లు వెచ్చిస్తున్నామని, రాష్ట్రంలో కోటి మందికి అందించాలని లక్ష్యమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement