హోటళ్లకు గుదిబండగా మారిన జీఎస్టీ పన్ను విధానాన్ని మార్చాలని ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్‌కు రాష్ట్ర హోటళ్ల సంఘం విన్నవించింది.
సాక్షి, హైదరాబాద్: హోటళ్లకు గుదిబండగా మారిన జీఎస్టీ పన్ను విధానాన్ని మార్చాలని ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్‌కు రాష్ట్ర హోటళ్ల సంఘం విన్నవించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎస్ వెంకట్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో మంత్రికి వినతి పత్రం సమర్పించింది.
అనంతరం వారు మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. 18 శాతం పన్ను వల్ల హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల వినియోగదారులు హోటళ్లకు వచ్చే పరిస్థితి లేదన్నారు. చిన్న, మధ్యతరహా హోటళ్లు ప్రభుత్వానికి క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తూ, వినియోగదారులకు సేవలందిస్తున్నాయన్నారు.