కన్నుల పండువగా సీతారాముల కల్యాణం | grandly celebrates sitaramula kalyanam | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

Mar 12 2015 9:51 PM | Updated on Mar 28 2018 11:08 AM

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం - Sakshi

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

షాబాద్ మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో గురువారం దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన, సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

రంగారెడ్డి: షాబాద్ మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో గురువారం దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన, సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. వేదపండితుల మంత్రోశ్చరణల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ ఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని అన్నారు. భగవంతునిపై విశ్వాసం ఉంచి నిత్యం పూజిస్తే తప్పక కరుణిస్తాడన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్‌యాదవ్, ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణ. కుమార్, నాయకులు కూర వెంకటయ్య, రాఘవరెడ్డి, పాపిరెడ్డి, వెంకటేశ్‌గౌడ్, మదన్‌గుప్తా, వేదపండితులు కిష్టయ్యజోషి, శ్రీనుపంతులు తదితరులు పాల్గొన్నారు.
(షాబాద్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement