తన కూతురుకు ఆడపిల్ల పుట్టిందనే కోపంతో అమ్మమ్మే 13 రోజుల పాపను నీటి బావిలో పడేసినట్లు
ఆడపిల్ల పుట్టిందనే కోపంతో బావిలో పడేసింది
నేలకొండపల్లి(పాలేరు): తన కూతురుకు ఆడపిల్ల పుట్టిందనే కోపంతో అమ్మమ్మే 13 రోజుల పాపను నీటి బావిలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారానికి చెందిన నందిగామ రాము, అర్పన దంపతుల 13 రోజుల పాప ఆదివారం మంచంలో నుంచి అదృశ్యమైంది. మంగళవారం రాము ఇంటి వద్దనున్న బావిలో పాప శవమై కనిపించింది.
పోలీసులు వచ్చి పాప మృతదేహాన్ని బయటికి తీయించారు. అయితే, పాపను అమ్మమ్మ వసంతే చంపి ఉంటుందని గ్రామస్తులు ఆరోపిస్తూ.. ఆమెపై దాడి చేసేందుకు ఇంటి వద్దకు వెళ్లారు. పోలీసులు విచారించగా.. ఆమె తానే చంపినట్లు ఒప్పుకుంది.