ప్రభుత్వ ఉద్యోగులారా బహుపరాక్‌

Govt Employees are not Allowed to do Election Campaign,Nalgonda - Sakshi

సాక్షి,షట్యాల (నకిరేకల్‌) :  ప్రస్తుతం శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో వివిధ రాజీకయ పార్టీల నాయకులు, ప్రజలు ప్రచారం చేస్తుంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు గనుక రాజకీయ పార్టీల అభ్యర్థుల తరఫున బహిరంగంగా ఏ రకమైన ప్రచారం చేసిన మాత్రం ఉద్యోగం ఊడుతుంది. 

సెక్షన్‌ 23(ఐ) ఏం చేబుతుందంటే..
1949 సెప్టెంబర్‌ 17 నుంచి ఎన్నికల కమిషన్‌లోని సెక్షన్‌ 23(ఐ)ని ఎన్నికల అధికారులు అమలు చేస్తున్నారు. ఈ సెక్షన్‌ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, ఇతర రంగాలకు చెందిన ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తరఫున ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు. అంతేకాదు పలాన అభ్యర్థికి, పార్టీకి ఓటు వేయమని నలుగురిలో చెప్పడం, పార్టీ గుర్తులతో ప్రచారం నిర్వహించడం చేయరాదు. వీటితో పాటు సోషల్‌ మీడియాలో అనుకూలంగా, ప్రతికూలంగా ప్రచారం నిర్వహించిన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు తగు జాగ్రత్తల్లో లేకుండా ఉద్యోగాలు ఊడిపోయే అవకాశాలుంటాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top