గాంధీలో వైద్యం చేయించుకున్న గ‌వ‌ర్న‌ర్  | governor narasimhan visits gandhi hospital | Sakshi
Sakshi News home page

గాంధీలో వైద్యం చేయించుకున్న గ‌వ‌ర్న‌ర్ 

Jan 8 2018 1:59 PM | Updated on Jan 8 2018 1:59 PM

 governor narasimhan visits gandhi hospital - Sakshi

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం మరోసారి గాంధీ ఆస్పత్రికి వచ్చారు.

సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ మరోసారి గాంధీ ఆస్పత్రికి వచ్చారు. ఈఎన్‌టీ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన సోమవారం గాంధీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు గాంధీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం గవర్నర్‌ ఐసీయూను సందర్శించి, అక్కడ రోగులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కాగా గత ఏడాదిలో కూడా గాంధీకి వచ్చిన నరసింహన్‌  కాలికి ఆనె(కార్న్‌)తో రావడంతో ఆపరేషన్‌ చేయించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement