
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవకుండానే గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం ఆకస్మికంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గవర్నర్ మంగళవారం ఢిల్లీకి వచ్చారు. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితర ప్రముఖులతో ఆయన భేటీ అవుతారని వార్తలొచ్చాయి.
కానీ ప్రధానిని కలవకుండానే గవర్నర్ హైదరాబాద్ వెళ్లిపోయారు. శుక్రవారం చైనాలోని ఉహాన్‌లో జరగనున్న సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాల్లో ప్రధాని బిజీగా ఉండటంతో గవర్నర్ వెనుదిరిగినట్లు తెలిసింది.