వెన్నుపూస బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : సంపూ | The Government Should Be Able To Help The Vertebrae Victims | Sakshi
Sakshi News home page

వెన్నుపూస బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : సంపూ

Jul 4 2018 2:20 PM | Updated on Jul 4 2018 2:38 PM

పరకాల రూరల్‌ : వెన్నుపూస బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగు సినిమా హీరో సంపూర్ణేష్‌ బాబు కోరారు. వెన్నుపూస బాధితుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం మండలంలోని నార్లాపూర్‌ గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ నడవలేక వెన్నుపూస సమస్యతో పూర్తిగా మంచానికే పరిమితమై దుర్భరజీవితం గడుపుతున్న బాధితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేయాలన్నారు.

స్పైనల్‌కార్డ్‌ బాధిత దివ్యాంగులకు ప్రత్యేక ఫిజియోథెరపీ సెంటర్లను నెలకొల్పడంతోపాటు వైద్యఖర్చుల నిమిత్తం ప్రతి నెల రూ.10వేలను అందించాలని కోరా రు. వారికి బ్యాటరీ వీల్‌చైర్స్‌ అందించాల ని డిమాండ్‌ చేశారు. ఎన్‌పీఆర్డీ జాతీయ కన్వీనర్‌ టి.రాజేందర్‌ మాట్లాడుతూ స్పైనల్‌కార్డ్‌ బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

కార్యక్రమంలో స్పైనల్‌కార్డ్‌ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ షఫీ అహ్మద్, ఉపాధ్యక్షుడు శ్రీధర్‌ రాజు, ఎన్‌పీఆర్డీ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌మున్నా, అర్భన్, రూరల్‌ జిల్లా అధ్యక్షులు వద్దె మానుకోట తిరుపతి, అడ్డరాజు, నియోజకవర్గ ఇంచార్జ్‌ లాసాని నర్సింగారావు, రాములు, రఘుపాల్‌రెడ్డి, రాముడు, రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement