నటనలో రాణిస్తూ.. | Good Cinema Artist In Nalgonda | Sakshi
Sakshi News home page

నటనలో రాణిస్తూ..

Jul 14 2019 9:05 AM | Updated on Jul 14 2019 9:06 AM

Good Cinema Artist In Nalgonda - Sakshi

కమీడియన్‌ ధన్‌రాజ్‌తో రమేశ్‌

సాక్షి, కొండమల్లేపల్లి (దేవరకొండ) : దేవరకొండ మండలానికి చెందిన మూడావత్‌ రమేశ్‌కు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి. అంతే కాకుండా డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. దీంతో పలు లఘు చిత్రాల్లో నటించడంతో పాటు దేవరకొండలో రాక్‌స్టార్‌ డ్యాన్స్‌ అకాడమీ పేరుతో నృత్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పలువురికి శిక్షణ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాక్‌స్టార్‌ రమేశ్‌గా గుర్తింపు పొంది తన ప్రత్యేకతను చాటుకున్నాడు. గతంలో రమేశ్‌ డ్యాన్స్‌ బేబి డ్యాన్స్, డుం..డుం..డిగా..డిగా.. వంటి కార్యక్రమాల్లో పాల్గొని పలువురి మన్ననలు పొందాడు. ఓ వైపు నృత్య పోటీల్లో పాల్గొంటూనే లఘు చిత్రాల్లో నటించడంపై దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే 2014లో టోల్‌ ఫ్రీ నెం.143, 2015లో క్లాస్‌ మేట్, 2016లో గణేశ్‌ లాంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటాడు. ప్రోత్సాహం అందిస్తే మున్ముందు కొరియోగ్రాఫర్‌గా రాణిస్తానంటున్నాడు రమేశ్‌. 

సామాజిక అంశాలపై అవగాహన
రాక్‌స్టార్‌ డ్యాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సామాజిక అంశాలకు సంబంధించి కార్యక్రమాలు చేపట్టాం. రానున్న రోజుల్లో సామాజిక అంశాలపై ప్రజలను మరింత చైతన్యవంతులను చేసేందుకు నావంతుగా కృషి చేస్తా.   – మూఢావత్‌ రమేశ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement