గోల్డెన్ టూర్ | Golden Tour | Sakshi
Sakshi News home page

గోల్డెన్ టూర్

Aug 24 2014 2:37 AM | Updated on Mar 23 2019 9:10 PM

గోల్డెన్ టూర్ - Sakshi

గోల్డెన్ టూర్

తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో పర్యాటకులను ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.

  •      జిల్లా ప్రజలకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
  •      పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఆఫర్లు
  •      కాజీపేట నుంచి ప్రత్యేక ఏసీ బోగీ
  •      ప్రయాణ చార్జీలో 5 శాతం రాయితీ
  •      ఆరుగురు వెళితే.. ఏడోవ్యక్తికి ఉచితం
  • సాక్షి, హన్మకొండ: తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో పర్యాటకులను ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. టికెట్ చార్జీల్లో రాయితీలతో పాటు ఏడుగురు ప్రయాణికులు గ్రూపుగా వెళితే.. అందులో ఒకరికి టికెట్ చార్జీలను మాఫీ చేస్తామంటూ తెలిపింది. ‘గోల్డెన్ ట్రయాంగిల్’ పేరుతో ఐఆర్‌సీటీసీ ఇటీవల ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, ఆగ్రా, అజ్మీర్, పుష్కర్, జైపూర్, ఫతేఫూర్ సిక్రీ, మధుర, బృందావనంలను చుట్టి వచ్చేలా గోల్డెన్ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసింది.

    అదేవిధంగా వైకోమ్, కడుత్తురుతి, ఎత్తుమన్నూర్, శబరిమలై అయ్యప్ప దర్శనంతో దక్షిణభారత టూర్‌ను సైతం ప్రకటించింది. ఈ రెండు టూర్‌ప్యాకేజీలకు సంబంధించిన టికెట్ చార్జీలో ఐదు శాతం తగ్గించింది. అంతేకాదు.. ఆరుగురు ప్రయాణికులు ఒక గ్రూపుగా టికెట్ బుక్ చేసుకుంటే ఏడో ప్రయాణికుడికి పూర్తిగా టికెట్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.
     
    కాజీపేట నుంచి ప్రత్యేక బోగి

     
    గోల్డెన్ ట్రయాంగిల్ టూరిజం ప్యాకేజీకి సంబంధించి 64 బెర్తులతో కూడిన ప్రత్యేక త్రీటైర్ ఏసీ బోగి కాజీపేట నుంచి ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన ఈ యాత్ర కాజీపేట నుంచి మొదలవుతుంది. ఎనిమిది పగళ్లు, ఏడు రాత్రులతో సెప్టెంబర్ 12వ తేదీన తిరిగి కాజీపేటకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి కాజీపేట స్టేషన్ నుంచి బయల్దేరే దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు గోల్డెన్ ట్రయాంగిల్ ప్యాకేజీకి సంబంధించిన ప్రత్యేక బోగిని జత చేస్తారు. పర్యాటకులను కాజీపేట నుంచి మొదటగా ఢిల్లీకి చేరుస్తారు.

    అక్కడ.. కుతుబ్‌మినార్, లోటస్‌టెంపుల్, ఎర్రకోట, రాజ్‌ఘాట్, ఇండియాగేట్, అక్షర్‌ధామ్ టెంపుల్‌లతో పాటు జమామసిద్‌లను వారికి చూపిస్తారు. జైపూర్‌లో హవామహల్, జంతర్‌మంతర్, అమీర్‌కోటలతో పాటు జైపూర్ సిటీలో విహారం ఉంటుంది. అజ్మీర్, పుష్కర్, ఆగ్రా సర్క్యుట్‌లో తాజ్‌మహల్, ఆగ్రాకోట, రామ్‌భాగ్, ఫతేఫూర్‌సిక్రీ, మధుర ద్వారకాదీశ్ టెంపుల్, శ్రీకృష్ణ జన్మస్థానం, కృష్ణబలరాం మందిర్, ప్రభుత్వ మ్యూజియంలతో పాటు బృందావనం సంద ర్శన ఉంటుంది.

    ఈయాత్రకు సంబంధించి ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధరగా రూ 15,507గా నిర్ణయించారు. రైలుప్రయాణంతో పాటు పర్యటన మధ్యలో అవసరమైన చోట రోడ్డు ప్రయాణం చేసేందుకు ఏసీ బస్సు, పర్యాటక ప్రాంతాల్లో గైడ్ల ఏర్పాటు, ఆలయాల సందర్శన బాధ్యతలను సైతం ఐఆర్‌సీటీసీనే స్వీకరిస్తుంది. పర్యటన మధ్యలో ఏసీ వసతి కలిగిన హోటళ్లలోనే బస ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా శబరిమలై వెళ్లే భక్తులకు నాలుగు రాత్రులు, ఐదు పగళ్లతో కూడిన మరో ప్యాకేజీ నవంబర్ 15వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతున్నారు.

    ఈ ప్యాకేజీకి సంబంధించి ఒక్కో ప్రయాణికుడికి టికెట్ చార్జీ రూ.6,698  ఉంది. ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. గోల్డెన్ ట్రయాంగిల్, శబరిమలై టూర్లకు వెళ్లాలనుకునే పర్యాటకులు, భక్తులు తమ టికెట్ల రిజర్వేషన్ కోసం 040-277022407, 9701360701, 9701360647, 9701360653, 9701360697, 9701360698, 9701360707, 9701360715 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement