నిజామాబాద్‌లో దొంగల హల్‌చల్ | gold and theft in nizamabad distirict | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో దొంగల హల్‌చల్

Jun 2 2015 9:28 AM | Updated on Aug 30 2018 5:27 PM

నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలో దొంగలు విరుచుకుపడ్డారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలో దొంగలు విరుచుకుపడ్డారు. మండలంలోని చందూరు గ్రామంలో సోమవారం రాత్రి బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న దంపతులను కత్తులతో బెదిరించి వారిపై దాడిచేసి 3 తులాల బంగారం, రూ. 20 వేల నగదు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మండల కేంద్రంలో తాళం వేసిఉన్న మరో ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని అందుబాటులో లేకపోవడంతో ఎంత నష్టం వాటిల్లిందనే విషయం తెలియరాలేదు. పోలీసులు ఈ రెండు ఘటనలకు పాల్పడింది ఒకే ముఠానా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement