ఘనంగా హనుమాన్‌ జయంతి  | gloriously Hanuman Jayanti | Sakshi
Sakshi News home page

ఘనంగా హనుమాన్‌ జయంతి 

Mar 31 2018 9:21 AM | Updated on Mar 31 2018 9:21 AM

gloriously Hanuman Jayanti - Sakshi

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న యువకులు

కొల్చారం(నర్సాపూర్‌): హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని కొల్చారం మండలంలోని ఆయా గ్రామాల్లో యువకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రంగంపేటకు చెందిన ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్‌ ఆధర్వంలో స్థానిక హనుమాన్‌ మందిర్‌ నుంచి చేపట్టిన బైక్‌ ర్యాలీ తుక్కాపూర్‌ , పైతర, కోనాపూర్, వై, మందాపూర్, ఎనగండ్ల, సంగాయిపేట గ్రామాల వరకు కొనసాగింది. పోతంశెట్టిపల్లి, రాంపూర్‌ గ్రామాలలో బైక్‌ ర్యాలీలను నిర్వహించారు. అంతకు ముందు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో రంగంపేట గ్రామానికి చెందిన ఆరెస్సెస్‌ కార్యకర్తలు మహేందర్, మచ్చరాజు, వెంకటేశం, శేఖర్, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement