ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష | Girlfriend Sits In Protest In Front Of Boyfriend House | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

Aug 7 2019 11:03 AM | Updated on Aug 7 2019 11:48 AM

Girlfriend Sits In Protest In Front Of Boyfriend House - Sakshi

దీక్ష చేస్తున్న శిరీష  

సాక్షి, ఖమ్మం(కొత్తగూడెం) : ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడిపై చర్య తీసుకోవాలని ఓ ప్రియురాలు లక్ష్మీదేవిపల్లి మం డలం అనిశెట్టిపల్లి పంచాయతీ మాలగూడెంలో  మంగళవారం దీక్ష చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని బర్మాక్యాంపునకు చెందిన అంగూరు శిరీష అనే యువతి పులిపాటి పారామెడికల్‌ కళాశాలలో నర్సింగ్‌ కోర్సు చదువుతోంది. మాలగూడేనికి చెందిన కాకెల్లి దిలీప్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. శారీరకంగా వాడుకుని పెళ్లి చేసుకుంటానని, ఇంటి నుంచి వచ్చేయమంటూ తీసుకెళ్లాడని శిరీష వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రియుడు, ప్రియురాలు ఇద్దరిని పోలీసులు పిలిపించి  కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  

మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లడం సరికాదని, పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు దిలీప్‌ను నిలదీయగా  ఆమె ఎవరో తనకు తెలియదని చెప్పడంతో ప్రియురాలు శిరీష కిద్ది రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని న్యాయం చేయాలంటూ దిలీప్‌ ఇంటి వద్ద మంగళవారం దీక్షకు పూనుకుంది. శిరీష దీక్ష చేస్తున్న సమాచారం తెలుసుకున్న లక్ష్మీదేవిపల్లి ఎస్సై నరేష్‌ బాధితురాలు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి న్యాయం చేస్తానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement