నల్లగొండలో గ్యాంగ్ వార్, మాజీ మావోపై కాల్పులు | Gang war in Nalgonda District, fire opened on Moist | Sakshi
Sakshi News home page

నల్లగొండలో గ్యాంగ్ వార్, మాజీ మావోపై కాల్పులు

Aug 25 2014 6:27 PM | Updated on Oct 16 2018 9:08 PM

నల్లగొండ జిల్లాలో మాజీ మావోయిస్టుల మధ్య గ్యాంగ్‌వార్‌ ఊపందుకుంది.

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మాజీ మావోయిస్టుల మధ్య గ్యాంగ్‌వార్‌ ఊపందుకుంది. వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో మాజీ మావోయిస్టు శంకర్‌పై సోమవారం సాయంత్రం ఆగంతకులు కాల్పులు జరిపారు. 
 
ఈ కాల్పుల్లో గాయపడిన శంకర్ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. శంకర్‌ బెక్‌పై వెళ్తుండగా ప్రదీప్‌రెడ్డి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. గతంలో నయిమ్‌ గ్యాంగ్ కాల్పుల్లో మరణించిన కొనపురి రాములుకు ప్రదీప్‌రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement