రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో.. తెలంగాణ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి కార్యక్రమం(టీఆర్‌ఐజీపీ)గా ఉన్న ఈ ప్రాజెక్టుకు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘తెలంగాణ పల్లె ప్రగతి’గా నామకరణం చే సింది. దీని అమలుకు విధివిధానాలతో శుక్రవారం పంచాయతీరాజ్ విభాగం ఉత్తర్వులు జారీచేసింది.
ఐదేళ్లపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు రూ.450 కోట్లు ఆర్థిక సాయంగా అందించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.192కోట్లు వెచ్చించనున్నారు. తొలి విడ తగా రాష్ట్రంలో వెనుకబడిన 150 మండలాలను ఎంపిక చేసిన అధికారులు.. ఆయా ప్రాంతాల్లో పేద వర్గాలకు జీవనోపాధి కల్పించడం, వారిని మానవ వనరుల అభివృద్ధికి చేరువ చేయడం వంటి కార్యక్రమాలను చేపడతారు. ఈ కార్యక్రమం 2020 ఫిబ్రవరి 1వర కు కొనసాగుతుంది.