
స్వాతంత్య్ర సమరయోధుడు రాంచంద్రారెడ్డి కన్నుమూత
స్వాతంత్య్ర సమరయోధుడు, జనగామ శ్రీఅరబిందో ఆశ్రమం, మాతృదర్శన్ మేనేజింగ్ ట్రస్టీ మందాడి రాంచంద్రారెడ్డి(83) గురువారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు.
జనగామ టౌన్ : స్వాతంత్య్ర సమరయోధుడు, జనగామ శ్రీఅరబిందో ఆశ్రమం, మాతృదర్శన్ మేనేజింగ్ ట్రస్టీ మందాడి రాంచంద్రారెడ్డి(83) గురువారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండ లం ఇప్పగూడెం గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి భూమి తనఖా బ్యాంకు చైర్మన్‌గా సేవలందించారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు, కాంగ్రెస్ నేతలు కాసాని నారాయణ, కమాలుద్దీన్ అహ్మద్, పొన్నాల లక్ష్మయ్యతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు.
స్వాతంత్య్ర సమరయోధుల రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులైన రాంచంద్రారెడ్డి మృతిపై పలువురు సంతాపం తెలి పారు. ఆయన పార్థీవదేహానికి శుక్రవారం ఉద యం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వడు ప్సా జిల్లా అధ్యక్షుడు ఇనగాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాంచంద్రారెడ్డికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆ మరణానికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైశాలితోపాటు పలువురు సంతాపం తెలిపారు.