మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
మానవపాడు: మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మానవపాడు మండలం చెన్నిపాడు మాజీ గ్రామ సర్పంచ్ను గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు.
కురుమన్న గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా... కొందరు కత్తులతో దాడి చేసి నరకడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో కురుమన్న బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామంలో మూడు ఇళ్లకు నిప్పు పెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. అతికష్టం మీద పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అలంపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.