ఎయిమ్స్‌కు నిధులివ్వండి | Focus on AIIMS | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌కు నిధులివ్వండి

Sep 1 2017 2:25 AM | Updated on Aug 10 2018 4:53 PM

తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రికి బూర నర్సయ్యగౌడ్‌ వినతి  
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఇక్కడ మంత్రిని కలసిన ఆయన వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి సంబంధిత ఫైలును ఆర్థిక శాఖకు పంపామని, త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే భువనగిరి పరిధిలో రీజనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు ఎంపీ బూర లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement