సుశీల్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: డీజీపీ

 Financial assistance to sushils family - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో మృతిచెందిన గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ సుశీల్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఎస్పీతోపాటు జిల్లా పోలీసులు సుశీల్‌ కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.2 లక్షలు అందించారు. ఈ చెక్కును సోమవారం రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో సుశీల్‌ భార్య, కుటుంబీకులకు డీజీపీ అందజేశారు.

సుశీల్‌ భార్యకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక సాయం అందించిన పోలీసులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ జితేందర్, పోలీస్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, సైబరాబాద్, ఖమ్మం అధ్యక్షుడు సీహెచ్‌.భద్రారెడ్డి, శ్రీనివాస్, గ్రేహౌండ్స్‌ డీఎస్పీ వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top