తాగిన మైకంలో తండ్రిని చంపిన తనయుడు | Father killed by son | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో తండ్రిని చంపిన తనయుడు

Nov 9 2014 3:43 AM | Updated on May 25 2018 2:06 PM

తాగిన మైకంలో గొడవపడి ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చిన సంఘటన..

తొర్రూరు : తాగిన మైకంలో గొడవపడి ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చిన సంఘటన మండలంలోని బొ మ్మకల్ గ్రామశివారు కండ్యి తండాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై కరుణాకర్‌రావు కథనం ప్రకారం.. తండాకు చెందిన దారవత్ సర్యి(65), మీరమ్మ దంపతుల కుమారుడు రాములుకు సుమారు 15 ఏళ్ల క్రితం దోళ్లతో వివాహమైంది. రాములు, దోళ్ల దంపతులకు కుమార్తె రేణుక జన్మించింది. కొన్నాళ్ల తర్వాత రాము లు తన భార్యతో తరచూ గొడవపడుతుండగా ఆమె విసుగుచెంది విడాకు లు తీసుకుని వెళ్లిపోయింది.

ఈ క్రమంలో రాముల మూడేళ్ల క్రితం బొమ్మకల్ గ్రామశివారు నెహ్రూనాయక్ తండాకు చెందిన రాధను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఏడాది గడవకముందే వారిద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతుండడంతో రాధ తన పుట్టింటికి వెళ్లిపోరుుంది. అప్పటి నుంచి రాములు తన మొదటి భార్య కుమార్తె  రేణుకతో తల్లిదండ్రులు వద్ద ఉంటున్నాడు. రోజూలాగే శుక్రవారం రాత్రి రాములు తాగి ఇంటికి వచ్చాడు. అదే సమయంలో గంప కింద ఉన్న కోడి బయటకు వచ్చి అరుస్తుండగా దానిని పట్టుకుని గంపలో వేసేందుకు ప్రయత్నిస్తున్న తండ్రి సర్యితో రాములు గొడవపడ్డాడు. తల్లి మీరమ్మ అతడిని ఆపేందుకు ప్రయత్నించ గా ఆమెను కొట్టాడు. అనంతరం మళ్లీ తండ్రి సర్యితో గొడవపడి గొంతు నులిమి, గట్టిగా మర్మాంగాలపై తన్ని కొట్టి చంపాడు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి భార్య మీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు రాములును అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుమారుడే తండ్రిని హత్య చేయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తండవాసులు కన్నీరుమున్నీరుగా రోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement