ఖరీఫ్‌నకు సిద్ధం | farmers ready to kharif season | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌నకు సిద్ధం

May 26 2014 2:39 AM | Updated on Oct 1 2018 2:03 PM

ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వేసవి దుక్కులు దున్నిస్తే పంటల సాగుకు అన్ని విధాల ప్రయోజనం ఉం టుందని రైతులు భావిస్తున్నారు.

 సదాశివనగర్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వేసవి దుక్కులు దున్నిస్తే పం టల సాగుకు అన్ని విధాల ప్రయోజనం ఉం టుందని రైతులు భావిస్తున్నారు. దీంతో  రైతులు ట్రాక్టర్లతో దుక్కులు దున్నించి పంట భూమిని సాగుకు సిద్ధం చేస్తున్నారు. వర్షాలు అనుకూలిస్తే మొక్కజొన్నతో పాటు పత్తి పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుంది. రెండేళ్లు గా అన్నదాత ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నా డు.

దీనికి తోడు ఏటేటా పెరుగుతు న్న విత్తనాలు, ఎరువుల ధరలు రైతన్నను మరింత కుదేలు చేస్తున్నాయి. ఈ ఏడాది భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో పాటు విత్తనాలు, ఎరువులు, కూలీల ధరలు పెరగడంతో పెట్టుబడులు అధికమయ్యాయి. ఈ ఖరీఫ్‌లో సదాశివనగర్ మండలంలో 3వేల 250 హెక్టార్లలో పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారుల అంచనా.

 అందుబాటులో విత్తనాలు, ఎరువులు
 నిజామాబాద్ అగ్రికల్చర్ : ఖరీఫ్ సమీపిస్తున్న తరుణంలో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, సమకూర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోయా, మొక్కజొన్న, పెసర్లు, మినుములు, తొగర్లు, జీలుగ, జనుము విత్తనాలను రైతులకు అందుబాటులో పెడుతున్నారు. అందుకోసం వివిధ కంపెనీలతో ఇప్పటికే అధికారులు సంప్రదింపులు జరిపారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ కంపెనీకి 25 వేల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాల కోసం ఆర్డర్ చేయగా ఇప్పటికే వారు 75 వందల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను సిద్ధంగా పెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా హెచ్‌ఏసీఏకు 20 వేల క్వింటాళ్లకు ఆర్డర్ ఇవ్వగా 6500 క్వింటాళ్లు సమకూర్చినట్లు చెబుతున్నారు. ఏపీ ఆయిల్ ఫెడ్‌కు 25 వేల క్వింటాళ్లకు  ఆర్డర్ ఇవ్వగా ఏమీ సమకూర్చలేదని తెలుస్తోంది. అదే విధంగా మొక్కజొన్న విత్తనాలు 3650 క్వింటాళ్లు, తొగర్లు 100 క్వింటాళ్లు, మినుములు 200 క్వింటాళ్లు, తొగర్లు 200 క్వింటాళ్లు, జీలుగ విత్తనాలు 1750 క్వింటాళ్లు, జనుము 340 క్వింటాళ్లు మాత్రమే సమకూర్చినట్లు సమాచారం.

 ఎంత అవసరం
 గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని రైతుకు సకాలంలో ఎరువులను అందించేందుకు వ్యవసాయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా యూరియా -135438 మెట్రిక్ టన్నులు, డీఏపీ-21033 మెట్రిక్ టన్నులు, ఫొటాష్(ఎంఓపీ)16811 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్-69403 మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.

 నిలువలు
 యూరియా 10723 మెట్రిక్ టన్నులు , డీఏపీ 2942.350 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1826.500 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్‌లో నిల్వ ఉండగా పోటాష్ ఏమీ లేదు.

 {పైవేటు డీలర్ల వద్ద
యూరియా 9778.690 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4932.200 మెట్రిక్ టన్నులు, పోటాష్(ఎంఓపి)1717 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్14431.200 మెట్రిక్ టన్నులు ప్రవేటు డీలర్ల వద్ద నిల్వ ఉంది. వీటితో పాటు వివిధ కంపెనీల్లో యూరియా 4711 మెట్రిక్ టన్నులు, డీఏపీ 318.800 మెట్రిక్ టన్నులు, పోటాష్(ఎంఓపి)13.200మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్- 13357 మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement