సబ్‌స్టేషన్ ముందు రైతుల ఆందోళన | farmers protest infront of sub stationin miryalaguda | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్ ముందు రైతుల ఆందోళన

Aug 23 2015 7:47 PM | Updated on Jun 4 2019 5:04 PM

సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ.. రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

మిర్యాలగూడ రూరల్(నల్లగొండ): సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ.. రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ మండలంలోని అవంతిపురం సబ్‌స్టేషన్ ప్రాంగణంలో జరిగింది. గత వారం రోజులుగా లో వోల్టేజీ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం జరుగుతుందని.. దీనివల్ల వ్యవసాయ బావుల వద్ద పడిగాపులు పడుతున్నామని ఎన్నిమార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. విద్యుత్ అధికారుల తీరుతో విసుగెత్తిన రైతులు కోదాడ మిర్యాలగూడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement