ఖరీఫ్‌కు రెడీ | farmers are ready for kharif | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌కు రెడీ

May 28 2015 3:25 AM | Updated on Oct 1 2018 2:00 PM

ఖరీఫ్‌కు రెడీ - Sakshi

ఖరీఫ్‌కు రెడీ

రైతులు ఖరీఫ్ సాగుకు కోటి ఆశలతో సిద్ధం అవుతున్నారు...

- దుక్కులు సిద్ధం చేసుకునే పనుల్లో రైతన్నలు
- ఖరీఫ్‌పై కోటి ఆశలు
- అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తనాలు
- రుతుపవనాల కోసం ఎదురుచూపు

రైతులు ఖరీఫ్ సాగుకు కోటి ఆశలతో సిద్ధం అవుతున్నారు. ఈసారి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే వస్తాయని  వాతావరణ శాఖ   అధికారులు పేర్కొనడంతో రైతులు పనుల్లో నిమగ్నమయ్యూరు. దుక్కులు దున్నుతున్నారు. సాగు సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టడంతో కొనుగోలు చేస్తున్నారు. ఈసారి  జిల్లా సాధారణ సాగు 4,77,000 హెక్టార్లు కాగా, 5,64,294 హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఎరువులు కూడా 2,51,600 మెట్రిక్ టన్నులు అవసరం. ఎరువులతోపాటు విత్తనాలను అధి కారులు అందుబాటులో పెట్టారు.
 
గత ఏడాది ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు ఆ కష్టాల నుంచి ఇంకా కోలుకోలేదు. అప్పులపాలై పుట్టెడు కష్టాల్లో ఉన్న అన్నదాతలు మళ్లీ గంపెడాశలతో ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నారు. ఈ సారైనా కాలం కలిసిరాకపోతుందా అని వానదేవుడిపైనే ఆశలన్ని పెట్టుకుని సాగుకు సమాయత్తమవుతున్నారు. నాగళ్లు అమరిస్తూ.. పొడి దుక్కులను దున్ని తొలకరి జల్లుల కోసం ఎదురు చూస్తున్నారు.
 
ములుగు : ఈ ఖరీఫ్‌లో వర్షాలు ముందే పలకరిస్తాయ ని వాతావరణ శాఖ వెల్లడించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సిద్ధం ఉం చేందుకు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, ఇన్‌చార్జ్ జేడీఏ గంగారాం ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 4 లక్షల 77 వేల హె క్టార్లలో సాధారణ సాగు ఉండగా, 5 లక్షల 64 వేల 294 హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచ నా వేశారు.

అందుబాటులో విత్తనాలు
జిల్లావ్యాప్తంగా 2,40,881 హెక్టార్లలో సాధారణ పత్తి సాగు ఉండగా ఈ సారి సుమారు 2,75,000 హెక్టార్లలో సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాకు 13,75,000 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం ఉండగా 19 లక్షల ప్యాకెట్లు ప్రభుత్వం నుంచి అందినట్లు ఇన్‌చార్జి జేడీఏ తెలిపారు. అలాగే 1,22,850 క్వింటాళ్ల వరిధాన్యం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేటు సంస్థల ద్వారా రైతులకు అందిస్తామని జేడీఏ తెలి పారు. అలాగే మొక్కజొన్న సాధారణ సాగు కోసం 10 వేల 256 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉన్నాయని, ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 180 క్వింటాళ్ళ పెసర్లు, 3 వేల కింటాళ్ల మొక్కజొన్న, 700 క్వింటాళ్ళ సోయాబీ, 50 క్వింటాళ్ల కందులు, 5 వేల క్విం టాళ్ల జీలుగ విత్తనాలు ఉన్నాయి.

ఎరువులు సిద్ధం..
ఖరీఫ్ సాగుకు 2,51,600 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. వీటిలో యూరియూ 1,20,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా ప్రస్తుతం వ్యవసాయ శాఖ వద్ద 47 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ ఎరువులు రైతుల సాగుకు సరిపడ డిమాండ్ మేరకు అందిస్తామని జేడీఏ తెలిపారు.  

హెచ్చరిస్తున్న ఎల్‌నినో
ఖరీఫ్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న రైతులను ఎల్‌నినో ప్రభా వం వెంటాడే పరిస్థితి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. గత సంవత్సరం 993.7 మి.మి సాధారణ వర్షపా తం నమోదు అవుతుందని భావించినా ఎన్‌నినో ప్రభావంతో కేవలం 623.5 మి.మి వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈసారి కూడా రైతన్నలు పంటల సాగు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement