అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer suicides on narwa | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Sep 23 2015 5:36 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధతో అన్నదాత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

నర్వ (మహబూబ్‌నగర్): అప్పుల బాధతో అన్నదాత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం కణ్మనూరు గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిన్న కొండన్న(43) తనకున్న మూడున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

గత రెండేళ్లుగా పంట దిగుబడి లేకపోవడంతో పాటు.. ఈ ఏడాది వేసిన కందిపంట ఎండి పోవడంతో.. మనస్తాపం చెంది పొలంలోనె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement