breaking news
kondanna
-
ఆర్థిక ఇబ్బందులతో ఆటో కార్మికుడి ఆత్మహత్య
బుక్కరాయసముద్రం : మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఆటో నడుపుకొంటూ జీవనం సాగించే కొండన్న(36) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక శనివారం ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నర్వ (మహబూబ్‌నగర్): అప్పుల బాధతో అన్నదాత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం కణ్మనూరు గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిన్న కొండన్న(43) తనకున్న మూడున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండేళ్లుగా పంట దిగుబడి లేకపోవడంతో పాటు.. ఈ ఏడాది వేసిన కందిపంట ఎండి పోవడంతో.. మనస్తాపం చెంది పొలంలోనె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానమే పెనుభూతమై..!
భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చిన తండ్రి కొత్తకోట: సంసారం సాఫీగా సాగుతుండగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు ఓ భర్త. కట్టుకున్న ఇల్లాలితో పాటు ఇద్దరు పిల్లలను అతిదారుణంగా చంపాడు. ఈ ఘటన రెండునెలల తరువాత ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెంలో ఆలస్యం గా వెలుగుచూసింది. మృతువుల బం ధువులు, స్థానికుల కథనం మేరకు.. పాలెం గ్రామానికి చెందిన ఆకుల కొండన్న, కృష్ణవేణి(27) భార్యాభర్తలు. వీరికి సాయిచరణ్(6),సాకేత్‌రామ్(5) కుమారులు. కృష్ణవేణి ప్రవర్తనపై భర్త కొండన్నకు అనుమానం కలిగింది. ఎలాగైనా భార్యాపిల్లలను చంపేయాలని పథకం రచించాడు. కాశీకి వెళ్తున్నామని గ్రామంలో చెప్పి సెప్టెంబర్ 6న పాలెం నుంచి వెళ్లిపోయినట్లు బంధువులు తెలిపారు. బాలానగర్ సమీపంలోని గౌటాపూ ర్ వద్ద కృష్ణవేణిని హత్యచేసి చెక్‌డ్యాంలో వేశాడు. బాలానగర్ పోలీసులకు అదేనెల 8న మహిళ మృతదేహం లభించడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అయి తే ఇద్దరు పిల్లలను వరంగల్ జిల్లా కాజీపేట వద్ద వడ్డేపల్లి చెరువులో వేసి హత్య చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 9న ఇద్ద రు పిల్లలను అనుమానాస్పదస్థితిలో మృతిచెందారని అ క్కడి పోలీసులు కేసు నమో దు చేశారు. అయితే కృష్ణవేణి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని నెలరోజుల క్రితం కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగా, ఇటీవల కొండన్న పలువురితో తన భార్యను తానే చంపానని కొందరు గ్రామస్తులతో చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కొండన్న పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. దీంతో ఆదివారం మృ తురాలి బంధువులు కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వాకబు చేయడంతో అసలు విషయం రెండు నెలల తరువాత వెలుగుచూసింది.