అప్పులబాధతో రైతు ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

Nov 29 2015 11:49 AM | Updated on Nov 6 2018 7:56 PM

కడెం మండలం సింగాపూర్ గ్రామంలో బాణావత్ తులసీరాం నాయక్(44) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

కడెం (ఆదిలాబాద్ జిల్లా) : కడెం మండలం సింగాపూర్ గ్రామంలో బాణావత్ తులసీరాం నాయక్(44) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయం చూసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో సుమారు రూ.5 లక్షల మేర అప్పలు అయినట్లు తెలిసింది. అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement