ఎస్‌బీహెచ్‌లో చోరీకి విఫలయత్నం | failed stolen in SBH | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్‌లో చోరీకి విఫలయత్నం

Sep 16 2014 12:03 AM | Updated on Sep 2 2017 1:25 PM

ఎస్‌బీహెచ్‌లో చోరీకి విఫలయత్నం

ఎస్‌బీహెచ్‌లో చోరీకి విఫలయత్నం

మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్‌లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు ప్రహరీ దూకి కిటికీ అద్దాలు పగులగొట్టి ఉండడంతో కిటికీ ద్వారా లోనికి వచ్చినట్లు తెలుస్తోంది.

- కిటికిలోంచి దూరి బ్యాంక్‌లోకి..
- పగలని లాకర్.. జరగని నష్టం
వాంకిడి : మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్‌లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు ప్రహరీ దూకి కిటికీ అద్దాలు పగులగొట్టి ఉండడంతో కిటికీ ద్వారా లోనికి వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాంకులో గల అల్మారా, లాకర్ గది తాలాలు పగులగొట్టి లాకర్ గదిలోని దూరి లాకర్ పగులగొట్టడానికి యత్నించిన పగులకపోవడంతో చోరీకి విఫలయత్నం జరిగింది. కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు, ఆసిఫాబాద్ సీఐ వెంకటేశ్, వాంకిడి సీఐ మోహన్‌రావు కథనం ప్రకారం.. శనివారం బ్యాంకు వేళ అనంతరం సిబ్బంది తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయారు.

ఆదివారం సెలవు దినం. సోమవారం ఉదయం బ్యాంకులో స్వీపర్‌గా పనిచేసే విజయ్ బ్యాంకు గేటు తాళం తీసి లోనికి వెళ్లాడు. లోపల గల లాకర్, రికార్డులు పెట్టె అల్మారాల తాళాలు పగిలి కింద పడి ఉండడంతో బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించాడు. దాంతో బ్యాంకు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement