breaking news
Wankdi
-
నిండు గర్భిణి.. ఏడు కిలోమీటర్లు
వాంకిడి(ఆసిఫాబాద్): అసలే గర్భిణి.. ఆపై పురిటినొప్పులు.. ఆదుకోవాల్సిన 108 అందుబాటులో లేదు. దిక్కుతోచని స్థితిలో ఓ భర్త ప్రసవవేదనకు గురవుతున్న తన భార్యను బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటన ఆదివారం కుమురంభీం జిల్లా వాంకిడి మండలం సోనాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భీంబాయికి నొప్పులు వచ్చాయి. 108 వాహనం లేకపోవడంతో నిండు గర్భిణి అయిన ఆమెను భర్త భీంరావు బైక్‌పై కూర్చోబెట్టుకుని 7 కిలోమీటర్ల దూరంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. సమయానికి చేరుకోవడంతో వైద్యులు ప్రసవం చేశారు. భీంబాయి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. -
ఎస్బీహెచ్లో చోరీకి విఫలయత్నం
- కిటికిలోంచి దూరి బ్యాంక్‌లోకి.. - పగలని లాకర్.. జరగని నష్టం వాంకిడి : మండల కేంద్రంలోని ఎస్బీహెచ్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు ప్రహరీ దూకి కిటికీ అద్దాలు పగులగొట్టి ఉండడంతో కిటికీ ద్వారా లోనికి వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాంకులో గల అల్మారా, లాకర్ గది తాలాలు పగులగొట్టి లాకర్ గదిలోని దూరి లాకర్ పగులగొట్టడానికి యత్నించిన పగులకపోవడంతో చోరీకి విఫలయత్నం జరిగింది. కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు, ఆసిఫాబాద్ సీఐ వెంకటేశ్, వాంకిడి సీఐ మోహన్‌రావు కథనం ప్రకారం.. శనివారం బ్యాంకు వేళ అనంతరం సిబ్బంది తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం సెలవు దినం. సోమవారం ఉదయం బ్యాంకులో స్వీపర్‌గా పనిచేసే విజయ్ బ్యాంకు గేటు తాళం తీసి లోనికి వెళ్లాడు. లోపల గల లాకర్, రికార్డులు పెట్టె అల్మారాల తాళాలు పగిలి కింద పడి ఉండడంతో బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించాడు. దాంతో బ్యాంకు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.