నాటుసారా స్థావరాలపై దాడి | excise officers attack on liquor making areas | Sakshi
Sakshi News home page

నాటుసారా స్థావరాలపై దాడి

Apr 3 2015 3:48 PM | Updated on Sep 5 2018 8:43 PM

ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని మూడు గ్రామపంచాయితీల పరిధిలోని నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.

కోటపల్లి : ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని మూడు గ్రామపంచాయితీల పరిధిలోని నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ లక్ష్మణ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఆల్గాం, పుల్లగాం, వెంచపల్లి గ్రామపంచాయితీల పరిధిలోని నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు.

ఈ దాడుల్లో నాలుగు వేల లీటర్ల నల్ల బెల్లం పానకం, 60 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేసినట్లు తెలిపారు. మూడు పంచాయతీల్లో కలిపి ఏడు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే దాడులు జరిపే సమయానికి కొద్ది నిముషాల ముందే నిందితులు పరారైనట్లు గుర్తించామన్నారు. కేసు విచారణ పురోగతిని దృష్టిలో ఉంచుకుని నిందితుల పేర్లు వెల్లడించడం లేదని, త్వరలో నిందితులను పట్టుకుని అరెస్ట్ చేస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement