వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర విద్యుత్ అవసరాలపై సమగ్ర అధ్యయనం చేస్తామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు.
హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర విద్యుత్ అవసరాలపై సమగ్ర అధ్యయనం చేస్తామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాలకు 5,000 మెగావాట్లు, హైదరాబాద్‌లో ఫార్మాసిటీకి 800 మెగావాట్లు, మెదక్ జిల్లాలోని నిమ్‌్జకు 1,000 మెగావాట్ల విద్యుత్ అవసరమన్నారు. ఈ అవసరాలను తీర్చేందుకు ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. హెచ్‌ఐసీసీలో సోమవారం జరిగిన విద్యుత్ ప్లాంట్ల సదస్సులో ఆయన మాట్లాడారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రం విద్యుత్ పరంగా స్వయం సమృద్ధి సాధిస్తుందన్నారు.