కోత కాన్పుల బాధ్యత అందరిదీ

Everyone is responsible for Cesarean Deliveries - Sakshi

ఐకాగ్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ ఎస్‌.శాంత 

సాక్షి, హైదరాబాద్‌: కోత కాన్పులు (సిజేరియన్‌) పెరగడానికి వైద్యులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారు బాధ్యులే అని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్సె స్ట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ (ఐకాగ్‌) అధ్యక్షురాలు డాక్టర్‌ ఎస్‌.శాంతకుమారి స్పష్టం చేశారు. గర్భిణులు ప్రసవ నొప్పులు పడేందుకు ఇష్టపడక పోవడం, లేటు వయసులో గర్భం దాల్చడం, మధుమేహం, ఒత్తిడి, ఫలానా ముహూర్తంలోనే బిడ్డను కనాలన్న కోరికలు వంటి అనేక కారణాలు ఇందుకు కారణమని చెప్పారు.

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆబ్సెస్ట్రిక్స్‌ అండ్‌ గైనకలాజికల్‌ సొసైటీస్‌ ఆఫ్‌ ఇండియా (ఫాగ్‌సీ) వార్షిక సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బ్రెజిల్‌ తదితర దేశాల్లో 60–70 శాతం కాన్పులు ఈ రకంగా జరుగుతుంటే..భారత్‌లో అది 20 శాతం మాత్రమే అని తెలిపారు.  ఫాగ్‌సీ సదస్సు గురించి వివరిస్తూ ప్రసవ సమయంలో వచ్చే ఇబ్బందులను అధిగమించడం ఎలా అన్న అంశంతోపాటు వంధ్యత్వం, అత్యవసర సేవలు వంటి మూడు అంశాలపై గైనకాలజిస్టులకు వర్క్‌షాపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐకాగ్‌ ఉపాధ్యక్షుడు పరాగ్‌ బిన్నీ వాలా పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top