బతుకమ్మ చీరల పంపిణీకి ఈసీ అడ్డుకట్ట

EC Stops Bathukamma Sarees Distribution In Telangana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బతుకమ్మ చీరల పంపిణీకి కేంద్ర ఎన్నికల కమిషన్‌ అడ్డుకట్ట వేసింది. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆదేశాలను అమలు చేయాలని ఈసీ లేఖలో స్పష్టం చేసింది. ఈ విషయంపై ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ వచ్చాక బతుకమ్మ చీరెల పంపిణీపై రాజకీయ పార్టీల ఫిర్యాదులు అందాయన్నారు.

ఆ ఫిర్యాదులను తాము కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపామని తెలిపారు. బతుకమ్మ చీరెల పంపిణీని నిలిపివేయాలని వారు ఫిర్యాదులో కోరారని పేర్కొన్నారు. రైతు బంధు చెక్కుల పంపిణీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top