ఎవరికో.. పొత్తు ముప్పు !

Early Elections In Telangana Assembly Nizamabad Politics - Sakshi

పొత్తులో భాగంగా జిల్లాలో టీడీపీకి కేటాయించే అవకాశాలున్న సీటుతో కాంగ్రెస్‌లో ఎవరి స్థానం గల్లంతవుతుందోననే అంశం తెరపైకి వస్తోంది.  కాంగ్రెస్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. టీడీపీతో జతకట్టడం ద్వారా జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఆ పార్టీకి  ప్రయోజనం చేకూరుతుందే తప్ప., కాంగ్రెస్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను ఢీ కొనేందుకు బీజేపేతర ప్రతిపక్ష పార్టీలు జట్టు కట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పొత్తులో భాగం గా జిల్లాలో టీడీపీకి కేటాయించే అవకాశాలున్న సీటుతో కాంగ్రెస్‌లో ఎవరి స్థానం గల్లంతవుతుందనే అంశం తెరపైకి వస్తోంది. ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు ఆస క్తి చూపుతున్న కాంగ్రెస్‌లోని ఎవరి ఆశలు నీరుగారుతాయో అన్న చర్చకు దారితీ స్తోంది. కాంగ్రెస్‌తో జతకట్టనున్న సీపీఐ, సీపీఎంలు ఉమ్మడి జిల్లాలో ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తున్నప్పటికీ ఎన్నికల  విషయానికి వస్తే గట్టి పోటీని ఇచ్చే స్థాయి లో లేవు. మరోవైపు తెలంగాణ జన సమి తి కూడా ఇంకా పుంజుకున్న దాఖలాల్లేవు. ఇస్తే టీడీపీకి ఒక సీటు కేటాయించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తు న్నాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఒక్కో నియోజకవర్గంలో టిక్కెట్‌ కో సం ఇద్దరు, ముగ్గురు పోటీ ప డుతున్నారు. ఈ తరుణంలో తమ సీటు పొత్తులో గల్లంతైతే తమ పరిస్థితి ఏంటని ఆశావహుల్లో ఆందోళన షురువైంది.

బాల్కొండ నుంచి బరిలోకి..! 
ప్రస్తుతం జిల్లాలో టీడీపీ కేడర్‌ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు వంటి ఒకరిద్దరు నేతలు మాత్రమే మిగిలారు. గత కొంత కాలంగా వీరిద్దరు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నిక ల్లో పోటీ చేసేందుకు మండవ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి మాత్రం బాల్కొండ నుంచి బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారు. గత ఎన్నిక ల్లో కూడా ఆయన ఇక్కడి నుంచే పోటీ చేశారు. పొత్తులో భాగంగా బాల్కొండ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తే.. ఈ స్థానంపై ఆశలు పెట్టుకు న్న కాం గ్రెస్‌ నేత ఈరవత్రి అనీల్‌ పరిస్థితి ఏంటనే అంశం తెరపైకి వస్తోంది. ఇప్పటికే బాల్కొండపై ఈరవత్రితో పాటు, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి కూడా కన్నేశారు. ఈసారి ఆర్మూర్‌ నుం చి కాకుండా, బా ల్కొండ నుంచే బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు ఆయన అనుచర వర్గం పేర్కొంటోంది.

ఈ తరుణంలో బాల్కొండ స్థానం పొత్తులో గల్లంతైతే ఇక్కడి ఇద్దరు కాంగ్రెస్‌ ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లు కానుంది. మరోవైపు అన్నపూర్ణమ్మ తన కు మారుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే జానారెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అభ్యర్థిత్వంపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఇంకా వేచి చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. మల్లికార్జున్‌రెడ్డి మాత్రం టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అంతగా ఆసక్తిగా లేరని అనుచరులు పే ర్కొంటున్నారు. అభ్యర్థిత్వంపై హామీ లభిస్తే కాంగ్రెస్‌లో చేరి బాల్కొండ నుంచి బరిలో ఉండే అవకాశాలున్నాయి. టీడీపీతో జతకట్ట డం ద్వారా జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఆ పార్టీకి  ప్రయోజనం చేకూరుతుం దే తప్ప కాంగ్రెస్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల వరకు మహాకూటమి పొత్తు తో జిల్లాలో రాజకీయ సమీకరణలు భారీగా మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top