ప్రభుత్వం సోమవారం నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి బీసీ
హైదరాబాద్: ప్రభుత్వం సోమవారం నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తిచేశారు. కౌన్సెలింగ్ ఇప్పటికి 3 సార్లు వాయిదాపడిందని, దానిని ప్రారంభించకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు.
శనివారం సచివాలయంలో కడియంను శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాసరావు, గుడుగు భాస్కర్, బి.రాజుగౌడ్, సింగం నగేష్, జూకంటి ప్రవీణ్, పి.లింగం కడియంకు వినతిపత్రాన్ని సమర్పించారు.