లైంగిక వేధింపుల కేసులో వైద్యుడి రిమాండ్ | Doctor remanded in the sexual abuse case | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల కేసులో వైద్యుడి రిమాండ్

Mar 18 2016 4:40 PM | Updated on Jul 23 2018 8:49 PM

ఆస్పత్రి సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

ఆస్పత్రి సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యుడు వసంతరావుపై గత కొన్ని రోజులుగా సిబ్బంది నిరసన తెలుపుతున్న విషయం విదితమే. ఆయన లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

 

దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆరోపణలు నిజమేనని తేల్చారు. ఆయనపై ఇప్పటి వరకు దాదాపు 30 మంది మహిళా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు వసంతరావుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేిశారు. ఈ మేరకు శుక్రవారం అరెస్టు చేసి, కోర్టుకు రిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement