పెళ్లికి ముందే నిల్వ చేసుకోవడం ఉత్తమం

Doctor Gynecologist Suggestions For Ovum Storage - Sakshi

మహిళల్లో మూడు పదుల వయసులోనే క్షీణిస్తున్న అండాశయ నిల్వలు

సంతానోత్పత్తిపై ప్రభావం డాక్టర్‌ లక్ష్మి చిరుమామిళ్ల వెల్లడి  

సాక్షి, సిటీబ్యూరో: వివాహాన్ని వాయిదా వేసుకునే యువతీ, యువకులు భవిష్యత్తు అవసరాల కోసం ముందే తమ అండం, వీర్యకణాలను భద్రపరుచుకోవడం ద్వారా 35 నుంచి 40 ఏళ్ల తర్వాత కూడా సంతానాన్ని పొందగలిగే అవకాశం ఉందని ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ లక్ష్మి చిరుమామిళ్ల అన్నారు. మంగళవారం నోవా ఇన్‌ఫెర్టి లిటీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల పేరుతో చాలా మంది యువతీ, యువకులు వివాహాన్ని వాయిదా వేసుకోవడం, ఒక వేళ పెళ్లి చేసుకున్నా..పిల్లలను కనడం వాయిదా వేసుకుంటున్నారన్నారు.

వయసు పెరిగే కొద్దీ మహిళల్లో అండాశయాలు, పురుషుల్లో వీర్యకణాల శాతం తగ్గి తీరా పిల్లలు కావాలనుకునే సమయంలో పుట్టకుండా పోతున్నారన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనందున వల్ల చాలా మంది సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదని, ఆ సమయంలో చికిత్స కోసం వచ్చినా వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నా రు. ఇటీవల ఈ తరహా కేసులు నగరంలో ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. దంపతులకు ఎగ్‌ ఫ్రీజింగ్‌పై అవగాహన లేనందున వారు నష్ట పోతున్నట్లు తెలిపారు. పెళ్లి సహా పిల్లలను వాయిదా వేసుకునే దంపతులు ముందే(25 ఏళ్లలోపు)తమ అండాలు, వీర్య కణాలను నిల్వ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిల్లలను పొందవచ్చునని ఆమె పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top