పంట రుణాల్లో జాప్యం వద్దు | Do not delay on crop loans | Sakshi
Sakshi News home page

పంట రుణాల్లో జాప్యం వద్దు

Oct 11 2014 1:49 AM | Updated on Sep 2 2017 2:38 PM

బ్యాంక్‌కు రుణమాఫీ పథకం మొదటి విడతగా విడుదల చేసిన నిధులను రైతుల అకౌంట్‌లకు జమ చేసి ఖరీఫ్ పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డి. రొనాల్డ్ రోస్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించారు.

చంద్రశేఖర్‌కాలనీ: బ్యాంక్‌కు రుణమాఫీ పథకం మొదటి విడతగా విడుదల చేసిన నిధులను రైతుల అకౌంట్‌లకు జమ చేసి ఖరీఫ్ పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డి. రొనాల్డ్ రోస్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జవహార్‌రోడ్డు(పుసలగల్లి)లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రైతులక పంట రుణాల మంజూరు, రుణ మాఫీ పథకం అమలుతీరును, బ్యాంక్ కార్యకలాపాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

పంట రుణాలు మంజూరు విషయంలో ప్రభుత్వ సూచనలు, నిబంధనలు పాటించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఎంతైన ఉందన్నారు. బోగస్ పట్టాదారు పాస్‌బుక్‌ల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 286 మంది రైతులకు రుణ మాఫీ పథకం కింద కొత్త పంట రుణాలు ఇస్తున్నామని బ్యాంక్ మేనేజర్ మిశ్రా వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ నర్సింహ, ఇన్‌చార్జి డీఆర్‌ఓ యాదిరెడ్డి, డిప్యూటీ ఎల్‌డీఎం రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
 
24 గంటల్లో మంజూరు..
ప్రభుత్వం రైతులకు రుణ మాఫీతో పాటు ఖరీఫ్ పంట రుణాలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24 గంటల్లోగా మంజూరు చేస్తానని మేనేజర్ హామీ ఇచ్చారని కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఈ సందర్భంగా విలేకరులతో చెప్పారు. కొత్త రుణాలను ఇవ్వడం లేదనే ఫిర్యాదు రావడంతో బ్యాంక్‌ను సందర్శించానన్నారు. కొత్తగా 400 మందికి  24 గంటల్లో రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పడం జరిగిందన్నారు. రైతులకు ఖరీఫ్ పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలని ఇప్పటికే ఆదేశించడం జరిగిందని  ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement