అటెండర్‌తో చెప్పులు తుడిపించిన డీఎంహెచ్‌వో!

DMHO Cleans His Chappals With Attender In Sircilla District - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్‌ అటెండర్‌ కనకయ్యతో చెప్పులు తుడిపించారు. ఈ ఘటన తంగళపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువత్తుతున్నాయి. డీఎమ్‌హెచ్‌వోపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అయితే ఈ ఘటనపై డీఎమ్‌హెచ్‌వో చంద్రశేఖర్‌ వివరణ ఇచ్చారు. ‘చెప్పులపై క్యాండిల్‌ మరకలు పడటంతో నేను తొలగిస్తుంటే.. అటెండర్‌ మధ్యలో కల్పించుకున్నాడు. చెప్పులను తీసుకుని వెళ్లాడు. నేను వారించిన కూడా అతడు వినలేదు. నా చెప్పులు తుడిపించే స్థాయికి దిగజారలేదు.  ఆ ఫొటో ఎవరు తీశారో కూడా నాకు తీయలేదు. ఇంట్లో కూడా నా పనులు నేనే చేసుకుంటాను’ అని చంద్రశేఖర్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top