జగిత్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో నిండిపోయింది.
కొండగట్టుకు పోటెత్తిన భక్తులు
Jun 13 2017 1:16 PM | Updated on Sep 5 2017 1:31 PM
జగిత్యాల: జగిత్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో నిండిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి మంగళవారం వేకువ జాము నుంచే వేలాది మంది భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. క్యూలైన్లన్నీ నిండిపోయి ఆలయం వెలుపల వరకు రద్దీ నెలకొంది. భక్తులు పవిత్ర కోనేరులో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది.
Advertisement
Advertisement