కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి | devaraj demands permanent jobs for contract workers | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి

Mar 10 2015 3:18 PM | Updated on Sep 2 2017 10:36 PM

కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాలపై పోరాడాలని ఐఎఫ్‌టీయు జిల్లా ఉపాధ్యక్షుడు జాడి దేవరాజ్ పిలుపునిచ్చారు.

కరీంనగర్ : కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాలపై పోరాడాలని ఐఎఫ్‌టీయు కరీనంగర్ జిల్లా ఉపాధ్యక్షుడు జాడి దేవరాజ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా మంచిర్యాలలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వెంటనే పర్మినెంటు చేయాలని ఆయన  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు వ్యవస్థకు వ్యతిరేకమని ప్రకటించిన రాష్ట్ర సీఎం నేడు కాంట్రాక్టు కార్మికుల గురించి పట్టించుకోవడం లేదన్నారు.

అయితే హైదరాబాద్‌లో ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే బహిరంగ సభల పోస్టర్లను ఈ సందర్భంగా నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయు, దాని అనుబంధ సంఘాల నాయకులు కాంతయ్య, నిశార్, సదానందం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement