వారం రోజుల క్రితం పట్టణంలోని కల్లూర్‌రోడ్‌లో నివాసముండే బాలికపై మాజీ కౌన్సిలర్ రషీద్ లైంగికదాడికి పాల్పడిన కేసు కొత్త మలుపు తిరిగింది.
* విద్యుత్ ఉద్యోగుల ప్రమేయం!
* పోలీసుల విచారణ
కోరుట్ల : వారం రోజుల క్రితం పట్టణంలోని కల్లూర్‌రోడ్‌లో నివాసముండే బాలికపై మాజీ కౌన్సిలర్ రషీద్ లైంగికదాడికి పాల్పడిన కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో కొందరు విద్యుత్ ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్న పోలీసులు ఈ దిశలో విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక పై మాజీ కౌన్సిలర్ రషీద్ లైంగికదాడికి పాల్పడ్డటంతో వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ యాక్టుతోపాటు నిర్భయ కేసు సైతం నమోదు చేశారు. వారి విచారణ నిర్వహించి రషీద్‌తోపాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
బాలిక స్థానిక సబ్‌స్టేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తుండగా ఆమెను మభ్యపెట్టి విద్యుత్ ఉద్యోగులు లైంగికదాడికి పాల్పడ్డట్లు సమాచారం. సదరు ఉద్యోగులు ప్రసు ్తతం పరారీలో ఉన్నట్లు తెలిసింది. వారికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సదరు బాలిక ట్రాన్స్‌కో కార్యాలయాల్లో స్వీపర్‌గా పనిచేస్తుండగా మైనర్‌తో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా పని చేయించారనే విషయం స్థానికంగా చర్చనీయమైంది. ఈ విషయంపై ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం.